గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌దు: ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): మంకీపాక్స్ గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శంక‌ర్ స్ప‌ష్టం వేశారు. కువైట్ నుండి కామారెడ్డికి వ‌చ్చిన ఓ వ్య‌క్తిలో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని హైద‌రాబాద్ ఫీవ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిన‌దే. బాధిత వ్య‌క్తి నుండి న‌మూనాలు సేక‌రించి, పూణెలోని ఎన్ ఐవి ల్యాబ్‌కు పంపించామ‌ని తెలిపారు. రేపు సాయంత్రానికి రిపోర్టు వ‌స్తుంద‌ని అన్నారు.

గాలిద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌గా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు.
పెద్ద‌గా ద‌గ్గిన‌పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుండి వ‌చ్యిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుండి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్ తెలిపారు.

2 Comments
  1. ayzl.cn says

    Oh my goodness! Amazing article dude! Thank you so much, However I am experiencing
    problems with your RSS. I don’t understand why I am unable to join it.
    Is there anybody getting similar RSS problems? Anybody who
    knows the answer can you kindly respond? Thanx!!

  2. from this source says

    Today, while I was at work, my sister stole my iphone
    and tested to see if it can survive a forty foot drop, just so she can be a youtube sensation. My iPad is now destroyed and she has 83 views.

Leave A Reply

Your email address will not be published.