కామారెడ్డి బాధితుడికి మంకీపాక్స్ నెగిటివ్..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలున్నాయని గుర్తించిన విషయం తెలిసినదే. అతని నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుండి కామారెడ్డికి వచ్చాడు. అతనికి 23వ తేదీనాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్లు గుర్తించి, ఆదివారం హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతనికి మంకీపాక్స్ నెగిటివ్ రావడంతో అటు అధికారులు, ఇటు వ్యక్తి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!
గాలి ద్వారా మంకీపాక్స్ సోకదు: ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్