AP: ఒక్కరోజులో 10 వేలకుపైగా కరోనా కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,713 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 10,057 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో 8 మంది మృతిచెందారు. ఈ వైరస్ బారి నుండి 1,222 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827 , చిత్తూరు జిల్లాలో 1,822 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.