300 గ్యాస్ సిలిండ‌ర్ లోడ్‌తో ఉన్న లారీ..  100కు పైగా పేలిన‌ సిలిండ‌ర్‌లు..

గిద్ద‌లూరు (CLiC2NEWS):  అనంత‌పురం-గుంటూరు జాతీయ రాహ‌దారిపై గ్యాస్‌ సిలిండ‌ర్‌ల‌తో ఉన్న లారీలో మంట‌లు చెల‌రేగి 100కు పైగా సిలిండ‌ర్‌లు పేలాయి. కర్నూలు నుండి  నెల్లూరు జిల్లాకు 300  భార‌త్ గ్యాస్   సిలిండ‌ర్‌ల‌తో వెళ్తున్న  లారీ  ప్ర‌కాశం జిల్లాలోని  కొమ‌రోలు మండ‌లం ద‌ద్ద‌వాడ గ్రామం వ‌ద్ద మంట‌ల్లో చిక్కుకుంది. లారీ క్యాబిన్‌లో మంట‌లు వ్యాపించ‌డం గ‌మ‌నించిన  డ్రైవ‌ర్ లారీ ఆపి త‌ప్పించుకున్నాడు. లారీలో ఉన్న‌వి అన్ని నిండు సిలిండ‌ర్లు కావ‌డంతో భారీగా మంట‌లు వ్యాపించాయి. జాతీయ రహ‌దారిపై ఇరువైపులా ఆర కిలోమీట‌రు మేర వాహ‌నాలు నిలిపివేశారు. పోలీసులు అప్ర‌మ‌త్త‌మై రాహ‌దారిపై వాహ‌నాలు అటువైపు వెళ్ల‌కుండా నిలువ‌రించారు. స‌మీపంలో ఉన్న  సుమారు 30 ఇళ్ల‌ను ఖాళీ చేయించారు. అగ్నిమాపక  వాహ‌నాలు  సైతం వ‌చ్చిన‌ప్ప‌టికీ  200 మీట‌ర్ల దూరం నుండి మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నించారు.  లారీ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.