India Corona: దేశంలో మరోసారి 12 వేలకు పైగా కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసుల విజృంభన కొనసాగుతోంది. గత కొద్ద రోజులుగా రోజువారీగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికి వరుసగా ఐదో రోజు 12వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 12,781 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 18 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. అలాగే తాజాగా 8,537 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 76 వేలు దాటాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,09,473 కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు 4,27,07,900 మంది కలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 76,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి.