దేశంలో 18వేలు దాటిన కేసులు..
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కేసులు తగ్గుతున్నట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరిగాయి. రోజూ 14 వేలు వస్తున్న కేసులు.. తాజాగా 18 వేలు దాటాయి. దీంతో దేవవ్యాప్తంగా క్రియాశీల కేసులు లక్షపైకి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 18,819 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే కొత్త కేసులు 4వేల మేర అధికంగా నమోదయ్యాయి.