కామారెడ్డిలో విషాదం.. తల్లీ కుమారుడు ఆత్మహత్య!
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డిలోని ఓ లాడ్జి గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది నుండి పొగలు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులు సంతోష్ (40), అతని తల్లి పద్మ (65)గా గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంతోష్‌ను భుమూలు అమ్మే విషయంలో స్థానికి ప్రజాప్రతినిధులు తమకు రూ. 50లక్షలు ఇవ్వాలంటూ కొందరు పోలీసు అధికారులతో కలిసి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఫేస్బుక్లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు ప్రజాప్రతినిధులు సంతోష్‌పై కక్ష కట్టారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల 11వ తేదీని సంతోష్ తల్లి పద్మ వైద్యకోసం కామారెడ్డి వచ్చి ఓ లాడ్జిలో దిగారు. వైద్య పరీక్షల అనంతరం వారు కామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీకాళభైరవ స్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లీ కుమారుడు ఆత్మహత్యకు ముందు వీడియో చిత్రీకరించారు.