పండుగ వేళ విషాదం.. కొడుకుతో సహా తల్లి మృతి..

సిర్పూరు (CLiC2NEWS): పండుగ వేళ పుణ్యస్నానానికి వెళ్లిన తల్లీ కుమారుడు సహా మరో యువకుడు మృతి చెందారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు మండలంలోని లోనవెల్లికి చెందిన ఎరుకొండ పద్మ(36), ఆమె కుమారుడు(14), చెల్లెలు మంగ(32 ) పుణ్యస్నానాలు చేయడానికి పెన్ గంగ నది ఒడ్డుకు వెళ్లారు. చెల్లిని, కుమారుడిని కాపాడబోయి పద్మ కూడా నీట మునిగిపోయింది. ఇది గమనించిన 108 పైలట్ సుభాష్ మంగను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. తల్లీ కమారుల ఆచూకీ లభించలేదు. అనంతరం జాలర్ల సాయంతో వెతికించగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.