కరెంట్‌షాక్‌తో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి మృతి
పెదబయలు (CLiC2NEWS): బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు పిల్లలుతో సహా తల్లి మృత్యు వాతపడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. గుడుగుపల్లిలో ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.