పల్నాడు జిల్లాలో ఇద్దరు కుమారులు సహా తల్లి బలవన్మరణం

పల్నాడు (CLiC2NEWS): ఎంత కష్టమొచ్చిందో ఏమో.. ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసి.. తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే పల్నాడు జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడింది. నరసరావు పేటలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను ఉరివేసి .. తాను ఉరివేసుకుంది. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి తీసుకెళ్తానని.. ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి ఆత్మహత్య