చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపైనా.. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సిఎంవైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. సమస్యలపై చర్చించేందుకు మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు చిరంజీవి సినీ పెద్దలతో తన నివాసంలోనే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. ప్రధానంగా టిక్కెట్ రేట్లపై.. చిన్న నిర్మాతలను ఆదుకునే విధంగా ఐదో షో విషయమై.. ఇండిస్టీలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై.. చిత్ర పరిశ్రమలో నెలకొన్న అసంతృప్తులపై.. ఆ సమస్యల పరిష్కారాలపై చర్చించారు.
ఈ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో జరిగే భేటీలో చిరంజీవి చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ఫిలించాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్. రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ, వంశీ ఇలా..నిర్మాతల సంఘం, పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.