Movie news: జూ. ఎన్టీఆర్‌కు స్వ‌ల్ప‌గాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): యంగ్‌టైగ‌ర్‌, టాలీవుడ్ అగ్ర‌న‌టుడు ఎన్టీఆర్ కు షూటింగ్‌లో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఓ యాడ్ షూటింగ్ చేస్తున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఆయ‌న కాలికి స్వ‌ల్పంగా గాయ‌మైంది. షూటింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న కింద‌ప‌డిపోవ‌డంతో గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఆయ‌న్ను స‌మీపంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ప్ర‌మాదంపై ఎన్టీఆర్ టీం ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఆయ‌న ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌క‌ట‌న‌లో అభిమానుల‌కు తెలిపంది. ఎన్టీఆర్ కోలుకోవ‌డానికి రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఆయ‌న ఆరోగ్యంపై వ‌స్తున్న ఊహాగ‌నాల‌ను ఎవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపింది.

కాగా ఎన్టీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు.

Also read: AP news: టిడిపిలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు

1 Comment
  1. […] Also Read: Movie news: జూ. ఎన్టీఆర్‌కు స్వ‌ల్ప‌గాయం […]

Leave A Reply

Your email address will not be published.