రేపటి నుంచే సినిమా థియేటర్లు ఓపెన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. లాక్డౌన్ వల్ల థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంతో ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను రాష్ట్ర సర్కార్‌కు విన్నవించారు.
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ మేరకు సర్కార్ నుంచి సినిమా హాళ్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో.. ఆదివారం నుంచి థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్‌పై నిర్ణయం తీసుకున్నారు.
ఈ భేటీ కంటే ముందు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, కిశోర్ బాబు, అభిషేక్ నామా, బాల గోవిందరాజు సమావేశం అయ్యారు. థియేటర్లకు ప్రకటించిన రాయితీలపై ఉత్తర్వులు జారీ చేయాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వానికి వినతులు..
- 2017 లో తీసుకొచ్చిన జీవొ 75 విషయంలో సర్కార్ మరోసారి పునరాలోచించాలి..
- థియేటర్లకు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
- లాక్డౌన్ సమయంలో థియేటర్లు అన్నిమూతపడి ఉన్నాయి. విద్యుత్ చార్జీల విషయంలో మినహాయింపు ఇవ్వాలి.
- కరోనా వల్ల ఆదాయం లేకపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలు చవిచూశారు. రెండేళ్లపాటు మున్సిపల్/
- ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలి.
- జిఎస్టీ తగ్గించి సినిమా మాల్స్‌ను కాపాడాలి.