పండగ సీజన్.. ఎపిలో సినిమా టికెట్ల ధరల పెంపు..
అమరావతి (CLiC2NEWS): ఈ పండగకు కొత్త సినమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం అగ్ర కథానాయకుల సినిమాలకు టికెట్ల ధరలను పెంచింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంక్రాతికి వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కానున్న విషయం తెలిసినదే. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ ఎపి ప్రభుత్వాన్ని కోరగా.. టికెట్ ధరపై గరిష్టంగా రూ. 45 (జిఎస్టి అదనం) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.