ఆ ఒక్కరోజు మాత్రమే రూ. 99కే మల్టీప్లెక్స్‌లో సినిమా..
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ ప్రేమికులకు పివిఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 20వ తేదీన పివిఆర్ సినిమాస్‌లో అన్ని షోలను కేవలం రూ. 99 కే చూడవచ్చు. సినిమా లవర్స్‌డే సందర్భంగా ఈ అవకాశాన్నికల్పిస్తోంది. సాధారణంగా మల్లీప్లెక్స్‌లో టికెట్ ధర రూ. 200పైనే ఉంటుంది. కానీ 20వ తేదీన పివిఆర్ సినమాస్ టికెట్ ధర రూ. 99 కే అందిస్తోంది. టికెట్ ధరకు జిఎస్‌టి అదనం. ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఎపిలలో టికెట్ ధర రూ. 100+జిఎస్‌టి ఉంటుంది. తెలంగాణలో రూ. 112+జిఎస్‌టిగా నిర్ణయించారు. ప్రీమియం కేటగిరి సీట్లు (రెక్లెయినర్, ఐమ్యాక్స్, 4డిఎక్స్ తదితర సమాన స్థాయిలు కలిగిన సీట్లు) ఈ ఆఫర్ పరిధిలోకి రావు. చంఢీగఢ్, పఠాన్‌కోఠ్, పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పివిఆర్ సినిమాల్లో ఈ ఆఫర్ వర్తించదు.