తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన ఎంపి కెకె

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 17 సందర్భంగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినమేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని స్పష్టం చేశారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందువల్ల ఇవాళ మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. సెప్టెంబర్ 17పై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.