సొంతూరెళ్లాలి, రక్షణ కల్పించండి.. ఎంపి రఘురామకృష్ణరాజు
అమరావతి (CLiC2NEWS): నరసాపురం ఎంపి రఘురామకృష్ణరాజు ఎపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పండక్కి సొంతూరికి వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే పోలీసులు ఆయనపై 11 కేసులు నమోదు చేశారు. మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సిఐడి అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని.. మరోసారి తప్పుడు కేసులు పెట్టే అరెస్టు చేసే అవకాశం ఉందని, పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వమని న్యాయస్థానాన్ని కోరారు.