Lok Sabha: తెలుగులో ప్రమాణం చేసిన తెలుగురాష్ట్రాల ఎంపిలు
ఢిల్లీ (CLiC2NEWS): లోక్సభకు ఎన్నికైన ఎంపిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిగా ప్రమాణం చేశారు. అనంతరం మిగతా ఎంపిలు ప్రమాణం చేశారు. ఎపి , తెలంగాణ రాష్ట్ర ఎంపిలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం.
పార్లమెంట్లో 18వ లోక్సభ కొలువుదీరింది. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఎపి , తెలంగాణ ఎంపిలలో కిషన్ రెడ్డి, టిడిపి ఎంపి అప్పల నాయుడు పంచెకట్టులో లోక్సభకు హాజరయ్యారు. ముందుగా ఎన్డిఎ మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్ , భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపిలు ప్రమాణం చేశారు.