పవన్ సూపర్ గెలుపుతో.. తన పేరు మర్పుపై ముద్రగడ స్పందన!

కిర్లంపూడి (CLiC2NEWS): జనసేనాని సూపర్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత విజయంతో మీడియా పవన్ ను ఆకాశానికెత్తింది. ఈ ఎన్నికల్లో `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్` పవన్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించక పోతే తన పేరు మర్చుకుంటానని సవాల్ విసిరిన మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు.
“పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేశా.. అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పా.. పేరు మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటా“ అని ముద్రగడ తెలిపారు.