దోహలో ట్రంప్‌తో ముకేశ్ అంబానీ భేటీ..

దోహ (CLiC2NEWS): అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. దోహలో ఎమిర్ ఆఫ్ ఖతర్ ఏర్పాటు చేసిన విందులో డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ విందుకు ముకేశ్ అంబానీ కూడా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడిని అంబానీ కలవడం ఇది రెండోసారి. ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్ష పదవి చేపట్టినపుడు ఇచ్చిన ప్రత్యేక విందులో తొలిసారి కలిశారు.
ఖతార్‌తో రిలయన్స్‌కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గూగుల్, మెటా వంటి అమెరికా దిగ్గజాలకు జియోలో వాలాలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విందుకు ఎలన్ మస్క్ కూడా హాజరయ్యారు.
గతేడాది వెనెజువెలా నుండి ముడి చమురు దిగుమతిని పునఃప్రారంభించడానికి అమెరికా రిలయన్స్ మినహాయింపులు పొందింది. అయితే.. వెనెజువెలా చమురు కొనగోలు చేస్తున్న దేశాలపై 25% టారిఫ్‌ను ట్రంప్ విధించడంతో ఆ దిగుమతి ఆగిపోయింది. ఇపుడు రిలయన్స్ రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసకుని , పెట్రోలు వంటి ఇంధనాలు తయారు చేసి వాటిని అమెరికాకు విక్రయిస్తుంది.