36 ఏళ్లనాటి కేసులో ముక్తార్ అన్సారీకి జీవితఖైదు

వారణాసి (CLiC2NEWS): నిబంధనలు ఉల్లంఘించి డబుల్ బారెల్ తుపాకి లైసెన్సు పొందిన కేసులో న్యాయస్థానం అన్సారికి జీవితఖైదు విధించింది. ముక్తారు అన్సారీ.. యుపి మాఫియా డాన్‌గా పేరుగాంచి.. 1990ల్లో రాజకీయాల్లోకి అడుగుపె ట్టాడు. 1991లో కాంగ్రెస్ నేతను హత్య చేసిన కేసులోనూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 1996 నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మూడు సార్లు జైల్లో ఉండగానే విజయం సాధించాడు. ప్రస్తుతం అతను బాందా జైల్లో ఉన్నాడు. మరో హత్యకేసులో అన్సారీ ప్రస్తుతం 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబర్ 22 నుండి అతనికిది ఎనిమిదో శిక్ష.. దాదాపు 60కి పైగా అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.