తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు కొనసాగుతున్నయి. ఆంక్షల నేపథ్యంలో కొన్ని ఆలయాల్లో వైకుంఠ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి.
తిరుమలలో శ్రీవారిని దర్శికున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ
తిరుమలలో బుధవారం అర్థరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెఇరిచారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1.45 గంటల నుంచి స్వామి దర్శనం ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించున్నారు.. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సిజెఐ జస్టిస్ ఎన్ వి రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.
వేకువ జామున భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ దంపతులు, హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ రమేష్, పలువురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
రాజన్న ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
తెలంగాణలో హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ (గురువారం) ఉదయం నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలను అంతరంగికంగానే అంగరంగ వైభవంగా నిర్వహించారు.