TS: మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ద‌వాఖానాకు రూ. 1,100 కోట్లు మంజూరు

హైదరాబాద్‌(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రంగ‌ల్‌లో నిర్మించ‌నున్న మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి రూ. 1,100 కోట్ల నిధులు మంజూరు చేసింది. 15 ఎక‌రాల విస్తీర్ణంలో 24 అంత‌స్థుల‌తో 2వేల ప‌డ‌క‌ల‌తో అత్యాధ‌నిక వైద్య స‌దుపాయాల‌తో ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు. పేద‌ల‌కు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాల‌నే ల‌క్ష్యంతో ఆసుప‌త్రిని ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ గ‌తంలో ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు నిధులు మంజూరు చేస్తూ శనివారం ఉత్త‌ర్వులు జారీచేసింది.

Leave A Reply

Your email address will not be published.