టిఆర్ఎస్ ది అధర్మ గెలుపు: రాజగోపాల్‌రెడ్డి
munugode by poll: TRS Adharma Victory: Rajagopal Reddy

నల్లగొండ (CLiC2NEWS): ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఉప ఎన్నిక లో తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ ఫలితాలపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాని కోమటిరెడ్డి తెలిపారు. టిఆర్ ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడందని ఆరోపించారు. కనీసం బిజెపిని ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని.. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన టిఆర్ ఎస్ ది అధర్మ గెలుపు అన్నారు. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని తన సొంతానికి వాడుకొందని ఆరోపించారు. కాగా ఈ మునుగోడు ఉప ఎన్నికలో నైతికంగా విజయం తనదేని పేర్కొన్నారు.