మునుగోడు ఉప ఎన్నిక‌: కారు జోరు.. ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యం

live updates: మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితాలు

15వ‌ రౌండ్‌

పూర్త‌య్యేస‌రికి

టీఆర్‌ఎస్‌
 97 ,006

 బీజేపీ
86,697

కాంగ్రెస్
23, 906


 

మునుగోడు ఉప ఎన్నిక‌: 10 వేల ఓట్ల మెజారిటీతో ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యం
మునుగోడు ఉప ఎన్నిక‌లో టిఆర్ఎస్ విజ‌యం సాధించింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. 14వ‌ రౌండ్ ముగిసే పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ 10 వేల‌కు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది.
ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 6608 ఓట్లు రాగా, బిజెపికి 5553 ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఈ రౌండ్‌లో 1055 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా టిఆర్ ఎస్‌కు 10191 ఓట్ల మెజారిటీతో కారు దూసుకుపోతోంది.


మునుగోడు ఉప ఎన్నిక‌: తెలంగాణ భ‌వ‌న్‌లో సంబ‌రాలు

మునుగోడు ఉప ఎన్నిక‌లో టిఆర్ఎస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. ఇవాళ జ‌రుగుతున్న ఉప ఎన్నిక కౌంటిగ్‌లో అధికార పార్టీ హ‌వా కొన‌సాగుతోంది. 13వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ 9 వేల‌కు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది.
ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 6619 ఓట్లు రాగా, బిజెపికి 5406 ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితికి 9136 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ఫ‌లితాల్లో కారు జోరు కొన‌సాగుతుండ‌టంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో టిఆర్ ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బాణాసంచా పేల్చ‌తూ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

13వ రౌండ్ రౌండ్ పూర్తి.. టిఆర్ఎస్ 9 వేల ఆధిక్యం

మునుగోడు ఉప ఎన్నిక‌లో టిఆర్ఎస్ హ‌వా కొన‌సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. 13వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 13వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ 9 వేల‌కు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది.
ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 6619 ఓట్లు రాగా, బిజెపికి 5406 ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితికి 9136 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


టిఆర్ఎస్ ది అధ‌ర్మ గెలుపు: రాజ‌గోపాల్‌రెడ్డి
ఎంతో ఉత్కంఠ‌గా సాగుతున్న ఉప ఎన్నిక లో తెలంగాణ రాష్ట్ర స‌మితికి స్ప‌ష్ట‌మైన ఆధిపత్యం క‌నిపిస్తోంది. ఈ ఫ‌లితాల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాతీర్పును గౌర‌విస్తున్నాని కోమ‌టిరెడ్డి తెలిపారు. టిఆర్ ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డంద‌ని ఆరోపించారు. క‌నీసం బిజెపిని ప్ర‌చారం కూడా చేసుకోనివ్వ‌లేద‌ని.. సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్ అధికారుల‌పై ఒత్తిడి తెచ్చార‌ని పేర్కొన్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన టిఆర్ ఎస్ ది అధ‌ర్మ గెలుపు అన్నారు. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని త‌న సొంతానికి వాడుకొంద‌ని ఆరోపించారు. కాగా ఈ మునుగోడు ఉప ఎన్నిక‌లో నైతికంగా విజ‌యం త‌న‌దేని పేర్కొన్నారు.


12వ రౌండ్ రౌంఢ్: 7 వేలు దాటిన ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. 12వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 12వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ 7 వేల‌కు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది. 12వ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 7,440 ఓట్లు రాగా, బిజెపికి 5,398 ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితికి 7,836 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

రౌండ్ల వారీగా ఫ‌లితాలు 

  • రౌండ్   బిజెపి      బిజెపి       కాంగ్రెస్         లీడ్
  • 1)        6418      5126       2100     1292 (టిఆర్ఎస్‌)
  • 2)       7781      8622       1537         841 (బిజెపి)
  • 3)       7390      7426       1926           36 (బిజెపి)
  • 4)     14854     14555       1817         299 (టిఆర్ఎస్‌)
  • 5)       6162       5245       2670        917 (టిఆర్ఎస్‌)
  • 6)      0161         5378       1962        638 (టిఆర్ఎస్‌)
  • 7)       7202        6803       1200       386 (టిఆర్ఎస్‌)
  • 8)      6620       6088         907        532(టిఆర్ఎస్‌)
  • 9)       7497       6665        1100      832(టిఆర్ఎస్‌)
  • 10)     7499       7015         1224      (టిఆర్ఎస్‌)
  • 11)      7235       5877         1100       (టిఆర్ఎస్‌)

11వ రౌండ్ రౌంఢ్: ఐదు వేలు దాటిన ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. 11వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 10వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ 5 వేల‌కు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది.
11వ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 7,235ఓట్లు రాగా, బిజెపికి 5,877ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితికి 5,774 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


10వ రౌండ్: నాలుగు వేలు దాటిన ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. 10వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 10వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ లీడ్‌లో ఉంది. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 7499 ఓట్లు రాగా, బిజెపికి 7015 ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితికి 4416 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు నాకే: కెఎ పాల్‌

మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితాల ఉత్కంఠ కొన‌సాగుతోంది. ప్ర‌జా శాంతి అధ్య‌క్షుడు ఈ ఫ‌లితాల‌పై స్పందించాడు. మునుగోడు ఉప ఎన్నిక‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీ అవినీతికి పాల్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. ల‌క్ష‌కు పైగా ఓట్లు త‌న‌కే వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌లో బ్యాలెట్ పేప‌ర్ పెడితే ఆ విష‌యాన్ని రుజువు చేసి చూపిస్తాన‌న్నారు. అంతే కాకుండా ఎల‌క్ష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని పాల్ డిమాండ్ చేశారు. కాగా అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామ‌ని పేర్కొన్నారు.


తొమ్మిదో రౌండ్లోనూ టిఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లిత‌ కౌంటింగ్ ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. 9వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 9వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ఎస్ లీడ్‌లో ఉంది. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 7497 ఓట్లు రాగా, బిజెపికి 6665 ఓట్లు వ‌చ్చాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితికి 832 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


రౌండ్ల వారీగా ఫ‌లితాలు 

  • రౌండ్   బిజెపి      బిజెపి       కాంగ్రెస్     లీడ్
  • 1)        6418      5126       2100     1292 (టిఆర్ఎస్‌)
  • 2)       7781      8622       1537         841 (బిజెపి)
  • 3)       7390      7426       1926           36 (బిజెపి)
  • 4)     14854     14555       1817         299 (టిఆర్ఎస్‌)
  • 5)       6162       5245       2670        917 (టిఆర్ఎస్‌)
  • 6)      0161         5378       1962        638 (టిఆర్ఎస్‌)
  • 7)       7202        6803       1200       386 (టిఆర్ఎస్‌)
  • 8)      6620       6088         907        532(టిఆర్ఎస్‌)
  • 9)       7497       6665        1100      832(టిఆర్ఎస్‌)

8వ‌ రౌండ్ పూర్తి.. టిఆర్ఎస్ 3 వేలు దాటిన ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. 8వ రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 8వ‌ రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ ఎస్ లీడ్‌లో ఉంది. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 6624 ఓట్లు రాగా, బిజెపికి 6088 ఓట్లు వ‌చ్చాయి. అన్ని రౌండ్లు క‌లిపి తెలంగాణ రాష్ట్ర స‌మితికి 3091 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


ఏడో రౌండ్‌లో టిఆర్ఎస్ కు 2,555 ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. ఏడో రౌండ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఏడో రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ ఎస్ లీడ్‌లో ఉంది. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్‌కు 7189 ఓట్లు రాగా, బిజెపికి 6803 ఓట్లు వ‌చ్చాయి. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్ 1800 ఓట్ల అధిక్యంతో ఉంది. టిఆర్ ఎస్ ఆధిక్యం 2555కి చేరింది.


ఆరో రౌండ్‌లో టిఆర్ఎస్ ఆధిక్యం..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. ఆరు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ ఎస్ లీడ్‌లో ఉంది. టిఆర్ ఎస్‌కు 6106 ఓట్లు రాగా, బిజెపికి 5378 ఓట్లు వ‌చ్చాయి. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్ 1800 ఓట్ల అధిక్యంతో ఉంది. టిఆర్ ఎస్ ఆధిక్యం 2169కి చేరింది.


పార‌ద‌ర్శ‌కంగా కొన‌సాగుతోన్న కౌంటింగ్ సిఇఒ వికాస్‌ రాజ్‌
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ పార‌ద‌ర్శ‌కంగా కొన‌సాగుతోంద‌ని సిఇఒ వికాస్ రాజ్ అన్నారు. ప్ర‌స్తుతం ఆరో రౌండ్ కౌంటింగ్ కొన‌సాగుతోంద‌ని అన్నారు. ఈ కౌంటింగ్లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించాని తెలిపారు. అధిక్య సంఖ్య‌లో పోటీలో ఉండ‌టం వ‌ల్లే కౌంటింగ్ ఆల‌స్యం అవుతోంద‌ని సిఇఒ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.


ఆ రెండు వంద‌ల ఇవిఎంల సంగ‌తేంటని ప్ర‌శ్నించిన కెఎ పాల్‌
మునుగోడు ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, స్వ‌తంత్ర అభ్య‌ర్థి కెఎ పాల్ ఈ ఎన్నిక‌లో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. 200 ఖాళీ ఇవిఎంల‌ను మిగ‌తావాటితో క‌లిపి భ‌ద్ర‌ప‌ర‌చ‌డంపై అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కెఎ పాల్ డిమాండ్ చేశారు.


చౌటుప్ప‌ల్‌లో ఆశించిన మెజారిటీ రాలేద‌న్న రాజ‌గోప‌ల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు హోరాహోరీగా కొన‌సాగుతోంది. కాగా చౌటుప్ప‌ల్‌లో తాము ఆశించిన మెజారిటీ రాలేద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డ‌డి అన్నారు.

 


ఐదో రౌండ్‌లో..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. అయిదు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యానికి టిఆర్ ఎస్ లీడ్‌లో ఉంది. టిఆర్ ఎస్‌కు 6162 ఓట్లు రాగా, బిజెపికి 5245 ఓట్లు వ‌చ్చాయి. ఈ రౌండ్‌లో టిఆర్ ఎస్ 917 ఓట్ల అధిక్యంతో ఉంది. మొత్తంగా 1631 ఓట్ల అధిక్యంలో కొన‌సాగుతోంది.


నాలుగో రౌండ్‌లో..
టిఆర్ఎస్: 26,433
బిజెపి : 25,729
కాంగ్రెస్ : 7,380


మూడో రౌండ్‌లో..
టిఆర్ఎస్: 7,010
బిజెపి : 7,426
కాంగ్రెస్ : 1,877


రెండో రౌండ్‌లో…
టిఆర్ఎస్: 7,771
బిజెపి : 8,622
కాంగ్రెస్ : 1,877


తొలి రౌండ్‌లో
టిఆర్ఎస్: 6,096
బిజెపి : 4,904
కాంగ్రెస్ : 1,877

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టిఆర్ ఎస్ ఆధిక్యం..
మునుగోడుఉప ఎన్నిక‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు పూర్త‌యింది. అధికార టిఆర్ ఎస్ అభ్య‌ర్థి ఆధిక్యంలో ఉన్నారు. వీట‌లో టిఆర్ ఎస్ కు 4 ఓట్లు ఆధిక్యం లభించింది. టిఆర్ ఎస్ 228, బిజ‌పికి 224, బిఎస్పీకి 10 ఓట్లు వ‌చ్చాయి.

 

మొత్తం ఓట్లు

మొత్తం ఓట‌ర్లు: 2,41,805
పోలైన ఓట్లు : 2,25,192
ప్ర‌స్తుత ఓటింగ్ శాతం : 93.13


 

 

ఓట్ల లెక్కింపు విధుల్లో 250 మంది సిబ్బంది..
మునుగోడు ఓట్ల లెక్కింపు విధుల్లో మొత్తం 250 మంది ఎన్నిక‌ల సిబ్బంది పాల్గొంటున్నారు. వీరిలో 100 మంది ఓట్ల లెక్కిపు కోసం.. మిగ‌తా 150 మందిని ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు కేటాయించారు.

1 Comment
  1. starlink satın al says

    Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!

Leave A Reply

Your email address will not be published.