మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 3న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. మునుగోడుతో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికకు నగరా మోగింది. తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఉప ఎన్నిక జరుగనున్న నియోజకవర్గాలు
- అందేరి ఈష్ట్ (మహారాష్ట్ర)
- మెకమా (బీహర్)
- గోపాల్ గంజ్ (బీహార్)
- అదంపూర్ (హరియానా)
- గోలా గోఖర్నాథ్ ( యుపి)
- ధామ్‌నగర్ (ఒడిశా)
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ – అక్టోబరు -7
- నామినేషన్ల స్వీకరణ గడువు – అక్టోబరు -14
నామినేషన్ల పరిశీలన – అక్టోబరు -15 - నామినేషన్ల ఉపసంహరణ – అక్టోబరు -17
- ఎన్నికల పోలింగ్ – నవంబరు – 3
- ఓట్ల లెక్కింపు – నవంబరు -6
కాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్య మైంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతాపార్టీలో చేరారు. దాదాపు ఇక్కడి నుంచి బిజెపి తరఫున రాజగోపాల్‌రెడ్డి టిక్కెట్ ఖరారైంది.
కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపి పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పోటీ చేస్తోంది. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ప్రచారంలో దూసుకెళ్తోంది.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇంక అభ్యర్థిని ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టిఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా అభ్యర్థిపై స్పష్టత రాలేదు.
ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలో త్రిముఖ పోరు తప్పేలా లేదు.