జియాగూడ బైపాస్‌పై వ్య‌క్తి దారుణ హ‌త్య‌..!

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినిఫ‌క్కీలో ముగ్గురు వ్య‌క్తులు క‌త్తులు, కొడ‌వ‌ళ్లోత ఓ వ్య‌క్తిని న‌డిరోడ్డుపై దారుణంగా న‌రికి చంపిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని జియాగూడ బైపాస్‌పై చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం పూర‌నాపూల్ స‌మీపంలో ఈఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థాలాన్ని ప‌రిశీలించారు. నిందితులు మూసీ న‌దిలోకి దూకి పారిపోయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టినట్లు పోలీసులు వివ‌రించారు. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో ఓ వ్య‌క్తి దూరం నుండి వీడియో తీశారు. ఇపుడు ఆ వీడియో ద‌ర్యాప్తున‌కు కీల‌కంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.