దేశాభివృద్ధికే నా ప్రయాణం: ప్రధాని మోడీ

లఖ్‌నవూ (CLiC2NEWS): గత ప్రభుత్వాల్లో కొందరు నేతలు ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు హామీలు ఇచ్చి.. ఫలితాల అనంతరం కనుమరుగయ్యే వారని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. తనను అలాంటి జాబితాలో చేర్చేందుకు ప్రతిపక్షలు ప్రయత్నిస్తున్నారని.. కానీ తాను అలాంటి నాయకుడిని కాదని అన్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.
ఉత్తర్ప్రదేశళ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ప్రధానమంత్రి పాల్గొన్నారు. రూ. 34,700 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిలో 16 విమానాశ్రయాలు, బహుళ అభివృద్ధి ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.