మైసూర్ పాక్ లో పాక్ తీసేసి మైసూర్ శ్రీ‌.. కొత్త పేరు పెట్టిన వ్యాపారి

జైపుర్ (CLiC2NEWS): రాజ‌స్థాన్‌లోని జైపుర్‌లో గ‌ల స్వీట్స్ షాప్ య‌జ‌మాని మైసూర్‌పాక్ లోని పాక్ ను తొల‌గించి మైసూర్ శ్రీ అని కొత్త‌పేరు పెట్టాడు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి , ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో భార‌తీయులంతా పాకిస్థాన్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రైతే సోష‌ల్ మీడియా వేదిక‌గా మైసూర్‌పాక్ పేరును మార్చాల‌ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఇంకా దీనిపై మీమ్స్ కూడా చేశారు. ఈ డిమాండ్ బాగా న‌చ్చిన త్యోహార్ స్వీట్స్ యాజ‌మాని త‌న షాపులోని మైసూర్ పాక్‌తో పాటు .. మోతీ పాక్‌, ఆమ్ పాక్‌, గోండ్ పాక్ పేర్ల‌ను మార్చి.. మైసూర్ శ్రీ‌, మోతీ శ్రీ‌, గోండ్ శ్రీ‌, ఆమ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టాడు.

Leave A Reply

Your email address will not be published.