కల్కి పార్ట్2పై నాగ్ అశ్విన్ అప్‌డేట్..

హైదరాబాద్ (CLiC2NEWS): కల్కి పార్ట్-2పై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళుతుందన్నారు. కల్కి-2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి గతేడాది విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అసలు ప్రాజెక్ట్ -కె అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నామన్నారు. ప్రస్తుతం స్కిప్టు వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళుతుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారన్నారు. ది రాజా సాబ్, ఫౌజి , సలార్2, స్పిరిట్, శౌర్యంగ పర్వం మూవీలు ఉన్నాయి. స్విరిట్ కోసం ప్రభాస్ డేట్స్ దర్శకుడు సందీప్ వరుస డేట్స్ అడిగినట్లు సమాచారం. సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి కానీ .. ప్రభాస్ ప్రీ అయ్యే ప్రసక్తే లేదు. దీంతో కల్కి-2 ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.