అభిమానులను సర్‌ఫ్రైజ్ చేసిన నాగచైతన్య..

Cinema: సెలబ్రెటీల బర్త్‌డే లను అభిమానులు జరుపుకుంటారు. అభిమాన హీరోను కలవాలనకుంటే మనమే వారి ఇంటికో, ఆఫీస్‌కో వెళ్లి కలుస్తాం. అలాంటిది నాగచైతన్య తనే స్వయంగా అభిమానుల ఇంటికి వెళ్లి.. వాళ్లని సర్‌ఫ్రైజ్‌కు గురి చేశాడు. ఈ నెల 23వ తేదీన హీరో నాగచైతన్య బర్త్‌డే సందర్బంగా ఆయన నటించిన వెబ్ సిరీస్ దూత ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ కె. కుమార్ దర్వకత్వంలో శరద్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుంది. ఈ సిరీస్‌న డిసెంబర్ 1న విడుదల కానుంది.