ఎపి క్యాబినెట్‌లోకి నాగబాబు.. సిఎం నిర్ణయం
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబుక చోటు దక్కింది. జనసేన పార్టి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో మంత్రి గా ప్రమాణం చేయనున్నారు. నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎపిలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 24 మంది ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదువులు దక్కాలి. కానీ.. జనసేన నుండి పవన్‌కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు మరో మంత్రి పదవి దక్కాలి. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.