వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌స్ఫూర్తితో మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 1080 ఎకరాల అడవి సంరక్షణ బాధ్యతను హీరో నాగార్జున స్వీకరించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు అర్భన్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఎంపి సతోష్‌కుమార్ తో కలిసి నాగార్జున కుటుంబ సమేతంగా అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అభివృద్దికి హరిత నిధి ద్వారా 2కోట్ల రూపాయల చెక్‌ను అటవీ శాఖ ఉన్నతాధికారులకు నాగార్జున అందించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో నేను స్వయంగా మొక్కలు నాటానని, అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడంపై ఎంపి సంతోష్‌కుమార్ తో గతంలోనే చర్చించానని తెలిపారు. అనుకున్న విధంగా అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. గ్రీన్ ఇండియ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవిని దత్తత తీసుకునేందుకు నాగార్జున ముందుకు రావడం పట్ల ఎంపి సంతోష్ కుమార్ ప్రశంసించారు.