ముఖ్యమంత్రి రేవంత్ తో నాగార్జున భేటీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి శనివారం వెళ్లి సిఎంతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌కు పుష్పగుచ్చాలు అందజేసి నాగార్జున దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.