హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సిని హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని అక్రమ నిర్మాణాలను అడ్డుకేనేందుకు సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఎజెన్సీ (హైడ్రా) తీసుకువచ్చారు.
హైదరాబాద్ నగరం పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి, చెరువలను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యాలు. నగరంలో నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. దీంతో కబ్జాదారులకు గుబులు మొదలైంది.
మరోవైపు ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. హైడ్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని, పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మాణం జరిగిందన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడినని, ఆ బూమి పట్టా బేమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్న అయన.. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడినన్నారు. తాజా పరిణామం వనల మేం ఆక్రమణలు చేసినట్టు, తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్లే అవకాశముందన్నారు. అధికారులు చేపట్టిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాస్థాననాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.