నాగార్జున సాగర్‌: 14 గేట్ల ఎత్తివేత

నాగార్జున సాగర్ (CLiC2NEWS): కృష్ణా న‌దికి వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో నాగార్జున సాగ‌ర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్​ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు 14 క్ర‌స్ట్‌​ గేట్లను ఎత్తి నీటిని కిందికి వ‌దులుతున్నారు. లక్ష క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సాగర్​ క్రస్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

  • సాగర్ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ 295.90 టీఎంసీలు
  • పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
  • ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులు

దాదాపు 5,18,724 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు 14 క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు 1,05,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.