పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన నాగార్జున‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సినీ హీరో అక్కినేని నాగార్జున ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందిన విష‌యం తెలిసిన‌దే. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు తెలుగు హీరోలు సైతం హాజ‌రై నివాళులర్పించారు. ఈరోజు నాగార్జున పునీత్ ఇంటికి వెళ్లి పునీత్ చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. ఇప్పటికి పునీత్‌ మరణాన్ని అభిమానులతో పాటు నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలంతా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.