ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ప్రారంభం..

ఆదిలాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ఆదివాసీల నగోబా జాతర సోమవారం అర్థరాత్రి ప్రారంభమైంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన నాగోబా దేవతకు పూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో, మెస్రం వంశీయుల సమక్షంలో జాతర ప్రారంభమైంది. నగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి తీసుకువచ్చారు. మెస్రం వంశం ఆడపడుచులు ఆలయ ఆవరణలో మట్టితో పుట్టులు తయారుచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన గిరిజనుల జాతరగా పేరొందిన ఈ జాతర ఐదురోజుల పాటు కొనసాగుతుంది. మహాపూజకు ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్సీ ఉదయ్ కుమారెడ్డి హాజరయ్యారు.