హరియాణా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్‌సైని ప్రమాణం

చండీగఢ్ (CLiC2NEWS): హరాయాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జెపినడ్డా, నితిన్ గడ్కరి, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరయ్ఆయరు. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. పంచకులలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్‌డిఎ కూటమి నేతలు హాజరయ్యారు.