సిరిసిల్ల చేనేత కార్మికుడు మరో అద్భుత సృష్టి..
తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రాలు
సిరిసిల్ల (CLiC2NEWS): తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీ పద్మావత అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు పట్టు వస్త్రాలను సమర్పించాడు సిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్. ఆయన తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సిఎస్ జవహర్ రెడ్డ చేతులమీదుగా ఈఓ ధర్మారెడ్డికి అందించారు. నల్ల విజయ్ ఇప్పటి వరకు చీరలు నేయడంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. 27 రకాల సంగంధ పరిమళాలు వెదజెల్లే చీర, వెండి పోగులతో పట్టు చీర, మూడు కొంగుల చీర, దబ్బనం రంధ్రంలో పట్టే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీరలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి బంగార వస్త్రాలు సమర్పించాడు.