‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుండి ‘న‌ల్లంచు తెల్ల చీర’ సాంగ్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ర‌వితేజ హీరోగా హ‌రీశ్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌. ఈ చిత్రం ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్రం బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా చిత్రం నుండి పాట‌ను రిలీజ్ చేసింది. న‌ల్లంచు తెల్ల‌చీర అంటూ సాగే పాటకు భాస్క‌ర‌భ‌ట్ట లిరిక్స్ అందించారు. శ్రీ‌రామ‌చంద్ర , స‌మీరా భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు. చిరంజీవి దొంగ‌మొగుడు చిత్రంలోని న‌ల్లంచు తెల్ల‌చీర పాట అప్ప‌ట్లో సూప‌ర్‌హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు ర‌వితేజ , భాగ్య‌శ్రీ బోర్సే న‌ల్లంచు తెల్ల‌చీర ఎలావుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.