షర్మిలకు బెయిలు మంజూరు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/ys-sharmila.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు బెయిలు మంజూరైంది. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని కోర్టు తీర్పును వెల్లడించింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని షర్మిలకు కోర్టు షరతు విధించింది.
సోమవారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులతపై షర్మిల చేయి చేసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఒక మహిళా కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని ఆమె వెనక్కి నెట్టారు. అలాగే పోలీసులు ఆపుతున్నా ఆమె డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో వాహనం టైరు ఒక్క కానిస్టేబుల్ కాలిపైకి ఎక్కింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు రెండు వారాల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ఆమె తాజాగా బెయిలు పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. షర్మిలకు బెయిలు మంజూరు చేసింది.