టిడిపి అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి: నారా లోకేశ్
ఇచ్చాపురం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘శంఖారావం’ యాత్రకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో విజయం తెలుగుదేశందేనన్నారు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మ ప్రేమకు ఎలా కండిషన్స్ ఉండవో.. ఇక్కడి ప్రజలు కూడా అంతేనన్నారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని, ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
టిడిపి ప్రభుత్వం ఉన్నపుడు ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని జగన్.. ఇప్పుడు కొత్త నాటకం అడుతు.. ఎన్నికల ముందు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.