ఎపి డిప్యూటి సిఎంగా నారాయణ స్వామి బాధ్యతలు ..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖలో ఇటీవల మరణించిన ఉద్యోగులకు సంబందించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడుదల రజిని, రాష్ట్ర హోమంత్రిగా తానేటి వనిత , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.
