ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నామన్న సిపిఐ నారాయణ

హైదరాబాద్ (CLiC2NEWS): మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. కూల్చివేతను స్వాగతిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారయణ అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను నారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పేదలు గజం స్థలం ఆక్రమిస్తే నానా రాద్ధాంతం చేస్తామని, నాగార్జున బిగ్‌బాస్‌కే బాస్.. చెరువును ఆక్రమించి కబ్జాలు చేశారన్నారు. ఎన్‌కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వస్తుందని .. ఆయనకు ఇదంతా లెక్కకాదన్నారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగపట్టాలు పొందిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
మల్లారెడ్డి , పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు. ఫిరంగి నాలాను కబ్జా చేశారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలి. ఎంఐఎం వారివి కూడా తొలగించాలి. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వరిపై చర్యలు తీసుకోవలన్నారు. మేం మొదటి నుండి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామిన నారాయణ అన్నారు.
[…] […]