Summer Special trains: నర్సాపూర్ – బెంగళూరు 8 ప్రత్యేక రైళ్లు
విజయవాడ (CLiC2NEWS): వేసవిలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. నర్సాపూర్ నుండి బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు నర్సాపూర్ నుండి విజయవాడ మీదుగా బెంగళూరు చేరకుంటుంది.
మే 5వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3.50గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరిన (07153) రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇదే రైలు (07154) తిరిగి 6వ తేదీ ఉదయం 10.50 గంటలకు బెంగళూరు నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు మే 6 వ తేదీ నుండి 27 వరకు ప్రతి శనివారం ఉంటుంది. నర్సాపూర్ నుండి ఈ రైలు .. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్ పట్టాయ్, బంగార్‌పేట్, కృష్ణార్జునపురం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.