జాతీయ ఉత్తమ నటుడు అల్లుఅర్జున్
![](https://clic2news.com/wp-content/uploads/2020/08/allu.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. పుష్ప: ది రైజ్ చిత్రంలో అతని నటనకు ఈ అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా అల్లుఅర్జున్ ఘనత సాధించాడు.
ఉత్తమ నటిగా ఈ సారి ఇద్దరు ఎంపికయ్యారు. గంగూభాయి కాఠియావాడి చిత్రంలోని నటనకు గాను ఆలియాభట్, మిమిలో నటనకు కృతిసనన్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, గుజరాతీ చిత్రం ఛల్లో షో, మలయాళీ చిత్రం హోమ్, కన్నడ చిత్రం 777 ఛార్లీ ఎంపికయ్యాయి.