జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయులు: తెలుగు రాష్ట్రాలనుండి న‌లుగురు..

హైద‌రాబాద్(CLiC2NEWS) ‌: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దేశం మొత్తంమీద 44 మందిని ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఎంపిక చేసింది. దీనిలో తెలుగురాష్ట్రాల నుండి న‌లుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం బుధవారం జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను ప్ర‌క‌టించింది. తెలంగాణ నుండి అసిఫాబాద్ జిల్లా ఎంపిపిఎస్ సావర్‌ఖేడ్ యాక్టింగ్ హెచ్ఎం రంగ‌య్య,సిద్దిపేట ఇందిరాన‌గ‌ర్ జిల్ల ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాలలోని హెడ్ మాస్ట‌ర్ రామ‌స్వామి ఎంపిక‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుండి విశాఖ జిల్లా లింగ‌రాజుపాలెం ఉన్న‌త పాఠ‌శాల ఉపాధ్యాయుడు భూష‌ణ్ శ్రీ‌ధ‌ర్‌, చిత్తూరు జిల్లా ఎం.పైప‌ల్లి ఉన్న‌త పాఠ‌శాల ఉపాధ్యాయుడు మునిరెడ్డి ఎంపిక‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.