దేశ భద్రత దృష్ట్యా 54 చైనా యాప్‌లపై నిషేధం..!?
ఢిల్లి (CLiC2NEWS): దేశ భద్రత దృష్ట్యా చైనాకు సంబంధించిన యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనాకు సంబంధింయిన 54 యాప్‌ల వలన యూజర్ల నుండి సున్నితమైన సమాచారాన్ని సేకరించి, తమ దేశంలో ఉన్న సర్వర్లకు బదిలీ చేస్తూ డేటా దుర్వినియోగానికి పాల్పడుతున్నాయిని కేంద్ర హోంశాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ యాప్‌లను నిషేధించాలని కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసినట్లు, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నదని పేర్కొన్నారు. నిషేధానికి గురైనవాటిలో ప్రముఖ గేమింగ్ యాప్ గరీనా ఫ్రీ ఫైర్ తో పాటు యాప్‌లాక్, వాయిస్ రికార్డర్, బ్యూటీ కెమెరా వంటి ప్రముఖ యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రీఫైర్ గేమ్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లనుండి తొలగించారు. నిన్నటినుండి ఈ గేమ్ ప్లేస్టోర్‌లో కనిపించటం లేదు. 2020లో పబ్జీని భారత్‌లో నిషేధించిన తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్‌కు విశేషాదరణ అభించింది.