బీరువాల నిండా డబ్బే డ‌బ్బు..

రాయ‌గ‌డ (CLiC2NEWS): ఆదాయ‌పు ప‌న్ను ఎగ‌వేస్తున్న కొంద‌రి ఇళ్లో ఐటి అధికారులు రెండు రోజులుగా దాడులు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో రూ. 510 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఒడిశాలోని రాయ‌గ‌డ గాంధీన‌గ‌ర్‌లో ఉంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు, టిట్లాగ‌ఢ్ ప‌ట్ట‌ణంలో ఉంటున్న దీప‌క్ సాహు, సంజ‌య్ సాహు, రాకేశ్ సాహు ఇళ్ల‌లో ఐటి అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఇళ్ల‌లోని బీరువాల నిండా నోట్ల క‌ట్ట‌లు పేర్చి ఉన్నాయి. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అధికారుల వంతైంది. ఇంకా భువ‌నేశ్వ‌ర్ సంఉద‌ర్‌గ‌ఢ్‌, బౌద్ధ్ జిల్లాల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాలు, ఝార్ఖండ్‌, కోల్‌క‌తాలోనూ ఐటి సోదాలు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.